Friday, February 11, 2022

చిత్ర కవిత తేది : 26-11-2021 శీర్షిక: తరువే తనువు

 చిత్ర కవిత 

తేది : 26-11-2021
శీర్షిక: తరువే తనువు 
కవిత సంఖ్య : 69+14

పచ్చ తివాచీలు పరుచుకుని 
కొండలు కోనలు సెలయేళ్ళ 
గలగలలతో  మరకతమై 
శోభించే మహీతలమొకనాడు... 

నాగరికతలలో నడకలు నేర్చి 
పారిశ్రామికతలో పరుగుల్లో దౌడు తీస్తూ
సాంకేతికతల సొబగులద్దుకుని
కాలుష్యాలు కబంధహస్తాలలో 
చిక్కుకుని కటకటలు పడుతున్న వేళ…. 

అశోకుడు రహదారికిరువైపుల 
చెట్లు నాటించెను బావులు 
తవ్వించెను... వెలుగులు విరజిమ్మిన 
గతాలు....చరిత్రలో మిగిలిన పేజీలు …. 

పాలకులకు అధికారాల యావలే గాని 
పర్యవరణ కాలుష్యాల పట్టింపులేవి…. 
పాపపు సంపాదనల కోటలేగాని 
పచ్చదనాల కొరకు ప్రాయశ్చిత్తపు కార్యాలేవి?

అక్కడో ఇక్కడో దరిపల్లి రామయ్యలో…. 
తులసీ గౌడలో లక్షల్లో మొక్కలు నాటుతూ
పర్యావరణాన్ని పదిలపరుస్తున్నారు 
భవిష్యత్తరాలకు మార్గదర్శకులు …. 
తరువులే తనువుగా బ్రతికేవాళ్ళు…. 
 
నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment