దేహ వృక్షం ....
తేది: 25-11-2021
శీర్షిక : నలుగురి క్షేమం ....
కవిత సంఖ్య : 802
అంకురాన ... బొంకలేని
సహజత్వం .... అరవిరిసిన
కమలమోలే ముఖారవిందం
ముసి ముసి నవ్వుల బంగారాలు
వెదజల్లే దేహ వర్ణం .... అందరిదీ ...
దిన దిన ప్రవర్ధమానమై
సత్సాం ప్రదాయాల తోటలో
సదాచారాల... వేదభూమిలో
ఆధ్యాత్మికతల.. అవపోషణలు
అంటించుకోకుండా ... అలసత్వాల
బానిసలై అలమటిస్తున్నారు
కొంతమంది ...కులమతాల పేరుజెప్పి ...
ఇంతింతై ... వటుడింతై లాగ
ఇంటిపేరులా నిలబడ్డాయి ...
కాలమాన పరిస్థితులో ...కట్టుబాటైన
వృత్తి ధర్మాలో ... కులాలు మతాలు ....
కులమేదైనా మతమేదైనా ....
జన్మచేత కానే కాదని ... వర్ణమెప్పుడు
కర్మచేతనేనని... ఖరాకండిగా
నిరూపించిన మానస పుత్రులెందరో
మహాఋషులెందరో .... దాఖలాలు
దఖలు పరిచిన ఉపనిషత్తులు .....
పచ్చపచ్చని వర్ణరంజితాలతో
మరకతమై శోభిస్తూ కొండా కోనా
వాగు వంకా.... నేలంతా విస్తరించి
జీవరాశి ఉనికికే మూలమయిన
విధంగా ... దేహమెప్పుడు నలుగురి
క్షేమం కోరాలి ...నాలుగు కాలాలు
కలిసి బ్రతకాలి .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment