Saturday, February 12, 2022

నమ్ముకున్న చోట తేది: 02-12-2021 శీర్షిక : పుట్టినూరు…

 నమ్ముకున్న చోట

తేది: 02-12-2021
శీర్షిక : పుట్టినూరు…. 
కవిత సంఖ్య : 808... 

బాల్యపు బంధాలలో మల్లెల 
సుగంధాలే... పుట్టి పెరిగిన పరిసరాలు.... 
ఆకతాయి తనాలతో  ఆటలమ్మ కోనలకు 
అలా వెళుతూ... ఇలావచ్చినా …. 

జ్ఞానమే  మోక్షకారకమని గట్టిగా 
నమ్ముకుని...చదువులమ్మ ఒడిలో 
పక్కూరుకు వెళ్ళి పడిపడి నడిచినా..
పైచదువులకంటూ పట్నం వెళ్ళివచ్చినా... 
అమ్మింటికొస్తేనే...పుట్టినూరుకొస్తేనే 
పట్టరాని సంతోషాలు పుట్టెడన్నీ …. 

ఓ ఇంతి చేయి పట్టుకుని జంటగా 
నడిచి..ఓ ఇంటివాడినయ్యాక కూడా
ఉద్యోగ రీత్యా ఊళ్లన్నీ తిరిగినా
వ్యవహార రీత్యా దేశమంతా తిరిగినా… 

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చక్కనమ్మ  
చెట్టు నీడలో మిత్రులెందరినో పొందినా... 
తటపటల తాత్కాలిక సేదలు దీరినా .... 
అమ్మానాన్నలు ఆకాశయాత్రకెళ్ళినా …. 

పదవీ విరమణలైయ్యాక… పదేపదే 
మనసుకోరింది…తనువు మళ్ళింది… 
మళ్ళీ పుట్టినూరు వైపే… 
నమ్మకమంటే…. నడచుకోవడమే 
ఆత్మ సాక్షిగా …. 


నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment