దర్శన భాగ్యం
తేదీ : 23-11-2021
శీర్షిక : జ్యోతి దర్శనం
కవిత సంఖ్య : 800
అంతంత అవగాహనలతో
అయ్యప్ప దీక్ష తీసుకుంటే ....
శరణమంటూ మొక్కగానే
శంకలన్నీ తీరిపోయినట్టు ...
గురుస్వామే గురుతరమై
దగ్గరుండి ... దాపునుండి
పూజా విధానాల బోధనలు
అర్చనల భజనల అవపోశన
పట్టించారు.....
ఎప్పుడెప్పుడా అయ్యప్ప
పయనమని.. ఆరాటపడ్డ
మనసును కుదుట పడేసి...
రానే వచ్చింది యాత్రా దినం ....
నలుబది రోజుల మండల
దీక్షలనంతరం ... కష్టాలను
బాపుమంటూ కాముక
ఇరుముడెత్తుకోని శరణు
ఘోష చెప్పుతుంటే....
కళ్ళముందే కదిలేది
స్వామివారి సన్నిధి ....
ఎరుమేలిన కాలినడకలతో
ఆకాశమంటి కొండా కోనా
దాటుకుని... అపర గంగ
ఆ చల్లని తల్లి పంబను
చేరుకొని పయనమయ్యేది....
శరణు ఘోష చెప్పుకుంటూ
సాయంకాలానికి సమాయత్తమై
ఎతైన కొండపై ఎదురుచూస్తూ
నిలిచాము... గుండెల నిండా గాలి
బిగపట్టి అంబరమంటే శరణుఘోషతో
మకరజ్యోతి దర్శనానికై ....
జలజలా రాలిన కళ్ళతో
ఒళ్ళంతా గగుర్పొడిచి
గుండంత బరువు దింపుకొని
కొండపైన దర్శించాము జ్యోతిని ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment