తేది : 21-11-2021
శీర్షిక : రైతు రాజేనా .....
కవిత సంఖ్య : 69+11
హతవిధీ హలధారీ
గతి ఏది... గమ్యమేది .....
జతగా నడిచిన
గిత్తలు మాయం ....
బొత్తిగ కొత్తదే
యంత్రపు బతుకు ......
// హత //
వజ్రోత్సవాలను
వారెవ్వా ...అనుకున్నా
రైతుకెవ్వరు
చక్రం తిప్పరు ..... // హత //
అతివృష్టి అనావృష్టిలు
అన్నీ దేవుడి చేతిలోనే
కృత్రిమ కొరతలేమో
దళారీల చేతుల్లోన......// హత //
అమ్మ పెట్టదు
అడుగ నివ్వదు
అప్పు పుట్టదు
కడుపు నింపదు… //హత//
అధికారంలోన
అందిపుచ్చరు
ప్రతిపక్షంలోన
ఫైలు కదలదు…. // హత //
ఉన్న చట్టములు
మనకు చుట్టమైతే ... మరి ...
వేవేల రైతుల
ఆత్మహత్యలెందుకు ... // హత //
తగ్గినదెవరో ... మరి ...
నెగ్గినదెవరో ...
తక్షణమే నువ్వు
గుర్తించు ..... // హత //
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment