Friday, February 11, 2022

నాదైన ప్రపంచం తేది: 26-11-2021 శీర్షిక : నాకెంతో ఇష్టం.

 నాదైన ప్రపంచం

తేది: 26-11-2021
శీర్షిక : నాకెంతో ఇష్టం. 
కవిత సంఖ్య : 802

మాతృ దెవోభవ !పితృ దేవోభవ !
లోక పరిచయ కారకులు ..... 
బుల్లిబుల్లి మాటల్లో బోధించింది 
బుడి బుడి అడుగుల్లో నేర్పించింది .... 

గురుదేవోభవ ... అనేక మంది 
గురువులు అడుగడుగున 
అక్షరాలా గొడుగులై .... ఆపన్న 
హస్తంగా తీర్చిదిద్దింది వారే .... 
బోధనలతో .... 

జీవితములో సగమై నిత్యం  
నన్నంటుకుని ... మంత్రిలా 
సలహాలిస్తూ ... మంచి మాటలతో 
కర్తవ్య దీక్షకు సాగదోలుతూ .... 
బాధ్యతల రాశిలో భాగమై  సదా 
తోడున్న సహనశీలి .....తోడ్పాటులతో   

కనిపెంచిన కంటిపాపలు 
నా కళ్ళల్లోని భావాలను  
ఎప్పటికప్పుడు  అనువాదపు 
దివిటీలుగా  అందిపుచ్చుకుని 
నడుస్తుంటే ..... 

కర్తవ్య దీక్షలో అలవడిన  
స్వీయ క్రమ శిక్షణలు ... 
పట్టుదల ఓర్పులు ..... 
నలుగురితో కల్సి నడిపించాయి ... 

అలవరుచుకున్న ఆధ్యాత్మికతల 
ఆలంబనలతో ..... 
సేవల విరామంలో  సైతం 
అప్పుడప్పుడు ... అక్కడక్కడా ... 
సత్య వీవెనలతో సంతృప్తిని 
పొందుతూ ... 

కలికాలంలో ఒంటరైనాననే  
బాధలు దరి చేరనీయకుండా 
ధర్మాన్ని నేను ఆసరాగ చేసుకొని 
అంటిపెట్టుకుని అడుగులేయడమే 
నాదైన ప్రపంచం .... నాకెంతో ఇష్టం. 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment