అశ్రద్ధ
తేది : 22-11-2021
శీర్షిక : అధిగమిస్తే వాడి బల్లెమే ...
కవిత సంఖ్య : 191
నాలుగు కాళ్ళు లేకున్నా ...
నోట మాటా మంతీలతో ప్రత్యేకం ...
లోచనాలోచనలతో ... మేధో
మదనాల... వివేకా విచక్షణలతో
మానవాళి ఎప్పుడూఆధిక్యమే .....
సొంతంగా ఆకాశంలో
ఎగరలేకపోయినా ....
రెండు కాళ్ళపై నిఖార్సుగా
నిటారుగా నిలబడగలిగే సత్తా ....
రాతి గుహల్లోనుండి రంగు
భవనాల్లోకి మారిన జీవితం ...
నిశిచీకట్లను చీల్చుకుని
నియాన్ లైట్ల వెలుగుల్లో
తచ్చాడుతున్న సాక్ష్యాలు ....
సకల సౌకర్యాలు సమకూర్చినా
అన్నీ ఉన్నా అల్లుని నోట్లో ...లా
నైపుణ్యతలన్నీ సానపెట్టుకున్నా
కుండెడు తేనెలో నీటిచుక్కలా ....
అలసత్వాల జోలెలతో అశ్రద్ధను
అవపోశన పట్టిన ఘన చరిత ....
అడుగడుగున అంకుశాలతో
అదిలించుకుంటూ కదిలిపోతూ ....
ఆ ఒక్కటి అధిగమించగలిగితే
ఎదురులేని వాడియైన బల్లెమే ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment