Saturday, February 12, 2022

ఉత్తేజ పవనాలు తేది: 30-11-2021 శీర్షిక :స్వచ్ఛమైన భాషాభిమానం

 ఉత్తేజ పవనాలు

తేది: 30-11-2021
శీర్షిక :స్వచ్ఛమైన భాషాభిమానం 
కవిత సంఖ్య : 806

వలస పాలనలు వీడినా 
విలాసాల దృష్టి దోషమో  ఏమో ... 
పొరిగింటి పుల్లకూరలో ... 
జీవిత గమనాల అవసరాలో ..... 
ఆంగ్ల మాధ్యమాలు అల్లుకున్నాయి ..... 

భావ మార్పిడే భాష ధ్యేయమైనా 
ప్రాంతాలను బట్టి... భాషలు వేర్వేరు
దేశం నిండా ... విశ్వం నిండా 
పుష్కలమాయె ఏడువేలకు దగ్గరగా ..... 

నిరక్షరాస్యతలు నిర్మూలించబడి 
అక్షరాస్యత రాకెట్టయి దూసుకుపోయినా ... 
అమ్మ భాష మాత్రం వెనుకబడిపోతుంది .... 
పాలకుల పట్టిలేని తనమో .....
ప్రజల అలసత్వాలో ..... 

తరమెనుక తరం గూడ్సుబండిలా వెనుకపడి 
పోతుంది ... తల్లి భాష ఆదరణలో .... 
కాలం చెల్లిన కవిత్వ సంపదలో.... 
కలిసిరాని పాఠకుల సహృదయతలో ..... 

రస రమ్యత  హృదయాలు లోపించిన 
పాఠకుల సమయలేముల విముఖతలో... 
కవులకు కలిసి రాని కాల భంగిమలో  .... 
విసియస్ సర్కిల్ లా విచ్చుకుంటుంది 

కవులంతా  సమాయత్తం కావాలి 
కలం కత్తి గట్టిగా ఝుళిపించాలి ... 
భావ పరంపరల భాషా సంపత్తిని 
ఉత్తేజ పవనాలతో దట్టంగా నింపాలి .... 

సరళమైన మాతృ భాషపై తరగని 
స్వచ్చమైన అభిమానం చాలు 
పదికాలాలు పదిలంగా నిలుప .... 
పట్టుబట్టి అందిద్దాం ముందుతరాలకు ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment