అయితే నాకేంటి !?
తేది: 24-11-2021
శీర్షిక : మనందరి పరిస్థితేంటని .... ?
కవిత సంఖ్య : 801
తెల్లోడి మాయో .... పొరుగోడి గీరో ...
జీవితాన్నిచ్చి ... కన్నోళ్లకు ....
కట్టుకున్నోళ్లకు .... కనిపెంచిన
పిల్లలకు... కడుపులు నింపుతున్నా ....
పని చేసినా ... చేయకపోయినా
పక్కాగా వచ్చే జీతభత్యాలు ....
పతారాతో పదిలంగా బతుకుతూ
పబ్లికులో పేరు ప్రతిష్టల గొప్పలు ....
చెయ్యవలసిన పనులకు కూడా
బల్లకిందనో ... బల్ల మీదనో ...
దీనంగానో .... ధీమాగానో ....
చేతులు చాపుచూ ...
ప్రజల వంక
బిక్షాలకై చూసే పిచ్చి చూపుల...
మూర్ఖులకు ....
సామాజిక సేవల పేరుతో బైలెల్లి
ధవళవస్త్రాల ముసుగుల్లో దాక్కు న్న
దమన నీతి సోదరులంతా ...
కరటక దమనక దరిద్ర వారసులకు ...
చెప్పేదేంటంటే.....
కన్నోళ్లకు కట్టుకున్నోళ్లకు దూరంగా ....
గడ్డకట్టే చలి మంచుల్లో ... ఎండా వానా
ఏదైనా ... కొండా కోనల్లో దాక్కుంటూ
లోపలున్నోళ్ల వారసులై అయినా ....
కరడు గట్టిన శత్రుమూకల ముందు
నాకేంటని మోకరిల్లితే .... !
మనందరి పరిస్థితేంటని ?
అందరూ సమీక్షించుకోవాలి .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment