ఆదర్శమైన దారిలో...
తేది : 25-11-2021
శీర్షిక : ముందుతరానికి వారధి
కవిత సంఖ్య : 192
అవసరాలలో ఉన్న ఆపన్నులకు
కష్టాలలో ఉన్న కలి వాసులకు
దుఃఖాలలో ఉన్న దురదృష్టవంతులకు
మిత్రులైనా ... శత్రులైనా ... శంకలేక
తగిన సమయానికి వీలైన పద్దతిలో
వీలు చూసుకుని సహకరించేదే ....
మాటల తీరు మల్లెపూవులై
పనుల తీరు పారిజాతములై
నడకల తీరు నల్ల కలువలై ...
నడతల తీరు సన్న జాజులై
వ్యక్తిత్వపు పరిమళాలు వెదజల్లాలి ....
పది మంది ఆఘ్రాణించి మెచ్చాలి ...
చల్లిన విత్తనాలు అంకురములై
నలుగురు జనాలకు నచ్చాలి ...
చిగురించిన రెమ్మలు కొమ్మలు
శాఖోప శాఖలై విస్తరించాలి ....
ఆదర్శవంతమైన దారులనేకం...
అబ్దుల్ కలామంతటి గొప్పతనంలా ....
స్వార్థ బంధుత్వాలకు తావీయక
దళారీ దందాలను దరికి రానీయకుండా
నీలగిరులంతటి నీతి నియమాలతో
సమున్నతమైన సత్య వాక్కులతో
ముందు తరాలకు మనమే
వారధులమవ్వాలి ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment