కడుపులో పడిన బిడ్డ కొరకు
కన్నతల్లి పరి పరి విధాలా
కలలు కంటూ తొమ్మిది నెలలు
కళ్ళు కాయలు చేసుకోవడం..... నిరీక్షణ
పిల్లలు పెద్దవాళ్లవ్వాలని
ప్రతి క్షణం కనిపెట్టుకుని
పదిమందిలో ప్రత్యేకత చాటి
పదిలంగా నిలుపాలనే ఆరాటం .. నిరీక్షణ
పై చదువులకని పట్నం పంపి
పిల్లలు ప్రయోజకులవ్వాలని
ప్రథమంగా ఉత్తీర్ణమవ్వాలని
ప్రతీ రోజు ఆవేదన పొందడమూ .... నిరీక్షణ
చదువుకు తగ్గ ఉద్యోగం దొరికి
తాహతుకు తగ్గ సంబంధాలు కుదిరి
తగిన సమయంలో పెళ్లిళ్లు అయ్యి
మనుమలు మనుమరాళ్ళ రావాలని .... నిరీక్షణ
తల్లి తండ్రులు పెద్దవాళ్ళయ్యాక
తనువులు మనసు మాట వినక
అప్పుడప్పుడు పిల్లలంతా
ఆట విడుపుకైనా వస్తారని .... నిరీక్షణ
ఆరోగ్యాలు సహకరించక
అనారోగ్యాలు సవారి చేస్తే
ఆసుపత్రులలో చేరినాక
అందుబాటులో పిల్లలుంటారో
లేదో అని ....... ..... .... ..... నిరీక్షణ
వృద్దాశ్రమాలల్లో చేరిన
తల్లి తండ్రులకు
మంచి చెడులు వల్లె వేసుకోడానికై
పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా ..
రారా అని ........ నిరీక్షణ
జీవితమంతా ఎదో ఒక నిరీక్షణ అయినా
మధురమైన నిరీక్షణలవుతే
మనసుకెంతో హాయినిస్థాయి .
No comments:
Post a Comment