అంశం : ఏరువాక
శీర్షిక : జయహో రైతన్న
అప్పుడప్పుడు వానలొచ్చి తొంగి చూసినా
ఆల్చిప్పలోన స్వాతి చినుకు ముత్యమైనట్టు
ఎండలెన్ని మల మల మాడ్చినా
ఎదురొచ్చే ఋతు పవనాలతో
పులకరించు తొలకరి జల్లుకు
పుడమి తల్లి నిలువెల్లా
చెరువు కుంట చెలిమలన్నీ జలములతో నిండగా
దరువు వేసి పల్లెల్లోన పిల్లా పాప లాడగా
ఏరువాక సాగి పోవు ఎవుసానికి
ఎదలు నిండ పొంగే రైతన్నలకు
ప్రకృతి భరోసాతో పౌర్ణమి రాకతో
పంట పనులన్నింటికీ శ్రీకారం చుట్టంగా
గత కాలపు కష్టాలను మరిచి
గంపెడంత ఆశతో కాశె పూసిన రైతన్న
కాడెద్దులు, కర్రు నాగండ్లు, పలుగు, పార పనిముట్లన్నింటికీ
పవిత్రంగా పూజించు మన దేశాన ( పురాణాల సాక్షిగా)
మెతుకు పండించి మనందరి
బతుకు నిలుపుతున్న రైతన్నలకు జయహో
జయ జయ జయహో
శీర్షిక : జయహో రైతన్న
అప్పుడప్పుడు వానలొచ్చి తొంగి చూసినా
ఆల్చిప్పలోన స్వాతి చినుకు ముత్యమైనట్టు
ఎండలెన్ని మల మల మాడ్చినా
ఎదురొచ్చే ఋతు పవనాలతో
పులకరించు తొలకరి జల్లుకు
పుడమి తల్లి నిలువెల్లా
చెరువు కుంట చెలిమలన్నీ జలములతో నిండగా
దరువు వేసి పల్లెల్లోన పిల్లా పాప లాడగా
ఏరువాక సాగి పోవు ఎవుసానికి
ఎదలు నిండ పొంగే రైతన్నలకు
ప్రకృతి భరోసాతో పౌర్ణమి రాకతో
పంట పనులన్నింటికీ శ్రీకారం చుట్టంగా
గత కాలపు కష్టాలను మరిచి
గంపెడంత ఆశతో కాశె పూసిన రైతన్న
కాడెద్దులు, కర్రు నాగండ్లు, పలుగు, పార పనిముట్లన్నింటికీ
పవిత్రంగా పూజించు మన దేశాన ( పురాణాల సాక్షిగా)
మెతుకు పండించి మనందరి
బతుకు నిలుపుతున్న రైతన్నలకు జయహో
జయ జయ జయహో
No comments:
Post a Comment