శ్వేత పత్రాలు
పరిణతి కలిగిన ప్రజా హితులు
ప్రభుత్వాలు చట్ట సభలలో
ప్రజాక్షేమం కాంక్షించి
శాసనాల ద్వారా చట్టాలు రూపొందించే
పరిణామ క్రమములో ప్రతి పనికి
ప్రజా ప్రభుత్వ నిర్ణయాల ముసాయిదాలను
పదిలంగా పొందుపరుస్తూ
సుందరంగా తీర్చి దిద్ది
ఒద్దికగా జన సామాన్యులకు
ఒనగూర్చ బోయే ఫలితాల పట్టికతో
అందరికి అందుబాటులో ఉంచి
ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన
ప్రజల సూచనలు, సలహాలను
ఆహ్వానిస్తూ విడుదల చేసే
అధికారిక పత్రమే శ్వేత పత్రము.
వేర్వేరు దేశాలలో కొంత వేరువేరుగా ఉన్నా
వెరసి ఇది ప్రభుత్వ అధికారిక పత్రం.
ప్రభుత్వ పనులంటేనే
పచ్చి ఫలాహారం పంచినట్టు
ఖజానా నుండి తీసినప్పుడు దోసెడు
కార్యక్రమం తయారయేది వీసెడుతో
పద్దుల కేటాయింపులు సంవత్సరంలో
ప్రతి పనికి ఇంత అని వేసినా ......
అందుకు సభల ఆమోదం పొందినా....
అందుకున్నవాడికి అందుకున్నంత చందంగా
ప్రజాస్వామ్యాలు పరిహాసం అవుతుంటే
పాశు పదాస్త్రం ఈ శ్వేత పత్రం.
ప్రభుత్వమంటేనే లక్షలు కోట్లు.
ప్రతీ ప్రత్యేక పని సంపూర్ణ వివరాలను
కార్యాచరణ ప్రణాళికను తేదీలు, అంకెలతో సహా
(బ్లూ ప్రింట్) ప్రభుత్వాలు అందిస్తుంటే
అందులోని లొసుగులు అనంతమైనప్పుడు
ప్రజల తరపున ప్రతి పక్షాలన్నీ కలిసి
అధికార పక్షం వారిని నిలదీయడానికి
అస్త్రమే శ్వేతపత్రం .......
వ్యాపార వాణిజ్య రంగాలలో సైతం
వారు వారు చేయబోయే
ఉత్పత్తుల, సేవల వివరాలను అందిస్తూ
వాటి సహేతుకమైన వివరాలను
న్యాయ తర్క వాదనలతో కూడిన
ఆధారాలను జతచేస్తూ
అందుకు సంబంధించిన సంపూర్ణ వివరాలతో
అమ్మకాలకై ఉపక్రమిస్తూ అందించే
సందేశ పత్రము సైతం శ్వేత పత్రమే .
No comments:
Post a Comment