అంధకారాల అంగవైకల్యాలు
అచ్చు తప్పుల కారణాలనేకాలు
అనూహ్య శాస్త్ర సాంకేతికతల నైపుణ్యం
అవయవాల మార్పిడి చికిత్సలపర్వం
ఆనందాల వెలుగుల దివ్య జ్యోతులమయం
హైవేలలోన మూల మలుపులో
పట్నపు గతుకుల రహదారులో
కాగలవు జీవితాన కొస మెరుపులు
బతుకంతా రక్తమోడు బారులు...
శిరస్త్రాణ ధారణ నిర్లక్ష్యాలు
పంచ ప్రాణాల పరాయణాలు
సీటు బెల్టుల త్రోసిరాజులు
చిన్నబోయే రక్షణ బుడగలు....
మత్తు జోగుల అపరిచితులైనా
చిత్తు బొత్తుల ప్రాణ సంకటం
తప్పని తిప్పలు బాటసారులకు
తప్పని తిప్పలు బాటసారులకు
తప్పెవరిదనే లెక్కలు మాని......
వైద్యో నారాయణ : మననం
వైవిధ్యత శస్త్ర చికిత్సలమయం
వైభవాల అవయవ మార్పిళ్ళు
విద్వత్తు కలిగిన మైలురాళ్ళు
దేవుడి గీతలా జీవుడు దేహం మార్చుకుని
విద్వత్తు కలిగిన మైలురాళ్ళు
దేవుడి గీతలా జీవుడు దేహం మార్చుకుని
ఆదరించే మానవత నిండిన మరో జన్మం
అపార విలువల అవయవాల దానం
అంది పుచ్చుకునే మానవ కళ్యాణం...
చావుపుట్టుకలు స్వంతమని
బతుకంత దేశానిదేనన్న కాళన్న..
తన దేహా దేవలాన్ని వైద్యసేవలకిచ్చె వాసిగా....
నిండైన వైద్య శాస్త్ర సాంకేతికతల
నిలువెత్తు మణి హారమాయె నిఖిలముగ.....
నిలువెత్తు మణి హారమాయె నిఖిలముగ.....
No comments:
Post a Comment