కోపగించుకుంటుంటారు దైవాన్ని
మాకేమిచ్చావని.......
ఇంకొంతమంది యువకులు
ఇరకాటంగా మాట్లాడుతుంటారు ...
అమ్మానాన్నలని ఏమిచ్చారని.....
దివ్యంగులతో సావాసం చేస్తే
తేట తెల్లమవుతుంది .....
తప్పేమి చేయకపోయినా
కుప్పకూలిన యువుకులనడిగితే
నిప్పులాంటి విషయం అర్థమౌతుంది....
భగవంతుడు, అమ్మా నాన్నలు
బంగారం లాంటి అమూల్యమైన
ఆస్తులేంటి ఇచ్చారో...........
అందమైన అవయవాలే సుమా...
నవ్య శాస్త్ర సాంకేతికత విప్లవం తో
అవయవ మార్పిడికి అంకురమేర్పడి
వైద్య రంగములో విజయ తీరాలు చేరడం
అనన్యసామాన్య మానవ వ్రత ఫలితం
అందుకే చేరండి, ప్రోత్సహించండి
అందుబాటులో ఉన్న
అవయవ దాన సమూహాలలో
అందించండి చేయూతను
ఆనందంగా మానవతను
అక్రందన పాలౌతున్న అభాగ్యులకోసం ......
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment