Monday, June 4, 2018

అమరుడైన కాళన్నకు - అచ్చమైన తెలంగాణ వందనం


ప్రజల తిప్పలను ప్రతిబింబించే - ప్రజా కవిగా పేరొందిన కాళ న్నా 

మానవతను నెత్తి కెత్తుకున్న  - మహనీయుడు సమ సమాజవాది...

అపూర్వమైనవి ఆయన రచనలు - ఆణి ముత్యాల్లాంటి  మాండలికాలు 

పాట్యాంశాలైనవి  డిగ్రీలకు, పీజీలకు-డాక్టరేట్లు పొందారు వారి సాహిత్యాలపై...

ప్రజా కవి కాలోజి శత జయంతిని - ప్రకటించారు అధికార భాషా దినముగా

పరవశించి జరుపుకున్నారు - పండుగలను మరిపించే విధముగా 


పుట్టినూరు ఓరుగల్లులో - పుడమి పూజ చేసారు 

పుణ్య మూర్తి పేరుమీద -  కళాక్షేత్రం కోసమై

కవి చంద్రుడైన కాళోజి శత జయంతిని -రవీంద్ర భారతిలో సంతోషంగా
రాచ మర్యాదలతో నిర్వహించిండ్రు -రాజ దాని నగరం నడిబొడ్డున 


ఎందఱో తెలంగాణ వాదుల- మది నిండా మెదిలే వాదనలను 

ముఖ్య మంత్రి మొదలుకునిముచ్చటించుకున్నారు  మురిపెంగా 


బడుగులతో నిండిన తెలంగాణా -బడా బాబులకు కేంద్ర్రంయ్యిందని 

మడమ తిప్పని మహా యోధుడు కాళోజి- తెగేసి చెప్పిండు, చరిత్ర తిరగ రాయండని

తెలంగాణ  యాస , భాష - తెల్లారి పోకుండా చూడమని 

అల్లాడిన తెలంగాణ  ప్రజా కవి - అతడే మన కాళోజి సారూ 
  

రాబోవు తరాలకు రాచ మార్గ మేర్పరచిన రచయితా 

అందుకొండివే అచ్చ తెలంగాణ- శత జయంతి వందనాలు 


ప్రజా కవి కాళోజి - ప్రజలకోసం రావోయి మరోసారి 
 స్వప్నించిన తెలంగాణా - రానే వచ్చింది మాగానై 

రైతు పంట పండించినట్టు - రాజు బాగా పాలించాలంటే 
రామ రాజ్యమై నిలవాలంటే - కాముక కావాలి నీలాంటో ళ్లు  

అందుకొండి వే  మా ఆత్మీయత నిండిన - శత జయంతి నివాళి 

08.09.2014                                                              నగునూరి రాజన్న,NTPC RDM 


No comments:

Post a Comment