రక్షణ సందేశం
మన కర్మభూమి సైనికులం
భద్రతెంతో ఆవశ్యం
పాటించు రక్షణ సందేశం
నవరత్న మకుటములో
కలికి తురాయి మనం
రక్షణ సాంప్రదాయాల
శిక్షణ గల సిపాయిలం
సర్వాంగానాం శిరస్సు ప్రథమం
"శిరోకవచం" ఆయుష్షుకు ప్రపూర్ణం
సదా ధరించు "శిరస్త్రాణం "
అదే కార్మికుని ఆరో ప్రాణం
సర్వాంగానాం నయనం ప్రధానం
సర్వోత్తమం "అయినా " ధరణం
జీవితాన విలువైనవి ఐబాల్స్
అవసరాన ధరించు "గాగుల్స్"
వీనుల విందుకు కర్ణభేరి ఆవశ్యం
అలవికాని శబ్దాలకు "ఇయర్ ప్లగ్స్" నిశ్శబ్దం
దుమ్ము ధూళిలో రిస్క్ చూసుకో
నాసికంబులకు "మాస్క్" వేసుకో
"తోలు బెల్టుని " త్రోయబోకు
తోడు కరువై విలపించనీయకు
కర్మ భూమి మనదేశం కాదనకు మిత్రమా
"కరం తొడుగులు" మానేసి రోధించకు నేస్తమా
కార్మిక జీవనాన "పాదరక్షలు" తోడని
రక్షణ పాటించే బాటసారి నీవని
చాటించు దశ దిశలా విశ్వవీథి గగనాన
కర్మ భూమి మన దేశం నమో నమామి.
No comments:
Post a Comment