Sunday, June 10, 2018

అత్యున్నత నిర్వాకం

అత్యున్నత నిర్వాకం 

సమైక్యఆంధ్రాలో సమున్నత స్థానం 
అధ:పాతాళానికి అంచున ఉన్న వైనం 

పచ్చి నిజాలు వెలుగు చూస్తున్న తీరు 
ప్రజాస్వామ్యాలను పరిహాసం చేస్తున్న వీరు 

అనైతిక పనులు చేస్తూ ఈ దినం 
అడ్డంగా దొరికిన నాయక గణం 

నీళ్లు నమలాల్సిన సమయాన 
ఒళ్ళు విరుచుకుని తిరుగుతున్నారు 

సగటు మనిషికి సైతం 
వెగటు పుట్టించే విధంగా 

ఎదురు వాదనలు చేస్తూ, చేయిస్తున్నారు 
ఎలాగైనా బయట పడాలని ఎదురు చూస్తున్నారు 

ధర్మమా నీ ఉనికిని ఉన్నది నిజమైతే 
దడ పుట్టించవా ఒక్కసారి ఈ "వి" నాయకులకు 


(written during the tv casting of note for vote case)
-- 

No comments:

Post a Comment