నేను బాల కవిని
నేను సాధారణమైన వ్యక్తిని
నేను కవిని కావాలనుకుంటున్నాను
నా పూర్వీకులు నామ మాత్ర విద్య కలిగినవారు
నా ప్రత్యేక చదువు వ్యాపార, వాణిజ్య విభాగము
నేను చరిత్రలంటూ చదవలేదు
నేను నా సంస్థ ,చుట్టూ జరిగే విషయాలపై స్పందిస్తుంటాను
నేను కుటుంబ సభ్యుల,బంధువుల ప్రేరణ పొందాను
నేను నా తోటి ఉద్యోగ మిత్రుల ప్రేరణ పొందాను
నేను సమస్యల మూలాలు తెలుసుకుంటాను
నేను స్వగతంగా ప్రశ్నిచుకుంటాను
నా కవితలలో తగు నివారణోపాయాలు తెలుపుతుంటాను
నేను సంపూర్ణంగా సంతృప్తిని చెందుతాను
నా కవితలనేకం సంస్థ పత్రికలో ముద్రించబడినాయి
నాకు సంస్థ లో తగిన గుర్తింపు లభించినది
నాకు ఇంకా కవిత్వం గురించి నేర్చుకోవాలనుంది
నాకు ఛందో బద్దమైన కవితలు సైతం కూర్చాలని ఉంది
అందుకు నా ఉద్యోగ విశ్రాంత జీవితములో
భాష పైన పట్టు పెంచే చదువులకై ప్రయత్నిస్తాను
నేను సమయాభావం అధిగమించాలని కోరుకుంటున్నాను
నేను శారదా దేవిని సవినయముగా ప్రార్థిస్తున్నాను
--
No comments:
Post a Comment