విష వలయం
ప్రభుత్వాలంటే పాలకులు, అధికారులు,
ప్రభుత్వాలంటే న్యాయాధీశులు,రక్షకులు
ప్రభుత్వాలంటే ప్రజలను ప్రణాళికగా పాలించాలి
ప్రభుత్వాలంటే ప్రజల రక్షణ, క్షేమం, బాగు కోరాలి
నాయకులు ఓట్ల ప్రయాణం మొదలైనప్పటి నుండి
ప్రబలంగా చెబుతూనే ఉంటారు ప్రతివారితో
ప్రమాణ స్వీకారం రోజు కూడా వదలకుండా
ప్రవచిస్తూనే ఉంటారు సేవలు చేస్తామని పాలకులు.
ఫలితాలు వెల్లడైన రోజున ధైర్యంగా నిలబడి
ప్రెస్సుల ముందు ముద్దు ముద్దుగా ప్రకటిస్తారు
ప్రజలకు పలు రకాల సేవలందిస్తామని
పాలనాధికారులు (IAS, IPS, DOCTOR, LAWYER)
పబ్లిక్ అంటే ప్రాణమంటారు ముందు -
ప్రయాణం మొదలైన తదుపరి మాత్రం
ప్రారంభించి విజృంభిస్తారు పందేరంలో
వెను తిరిగి చూసుకోరు, ఉన్నవారు చూడనివ్వరు .
వ్యయ ప్రయాసలకోర్చి వ్యసనాలు అలవర్చుకుని -
స్వార్థం, బంధు ప్రీతీ, లంచగొండి తనాలకు చేరువై
అదే జీవితం ,లోకమనుకుంటున్నారు అందరూ
ప్రజలను పలు రకాల పిప్పి చేసి పిండుకుంటున్నారు.
సాంప్రదాయులు, సంస్కారవంతులు ఎవ్వరైనా సరే
అందరూ విషవలయములో బందీ కావాల్సిందే,
కాదు లేదని ఎదురు తిరిగినా, ఏకరువు పెట్టినా
కాటేయడానికి వెనుకాడదు - కబళిస్తుంది బలి పీఠం.
No comments:
Post a Comment