Sunday, June 10, 2018

గుజరాత్ టు ఢిల్లీ

గుజరాత్ టు ఢిల్లీ

గుంభనంగా వచ్చాడు గుజరాత్ నుండి 
ఢిల్లీ పీఠం అధిరోహించాడు చిన్నంగా 
పెద్ద వారిని గౌరవించడములో చిన్నవాడే 
చిన్న వారిని చేరదీయ పెద్ద మనస్కుడే 

ఒక్కడు - ఒక్కడే ఒక్కడు 
దేశానికి వన్నె తెచ్చె ఆ ఒక్కడు 
కష్టసుఖాలను ఎరిగిన కర్మ యోగి 
కనలేము స్వార్థం ఏ కోణమెరిగి 

గాంధీ వాదము నమ్మిన వాడు 
పటేల్ ధైర్యం ప్రదర్శిస్తాడు 
ఆలోచనలలో అబ్దుల్ కలాం 
ప్రజలకు తానంటాడు గులాం 

జాతీయతలో సుభాషుడు 
జన సమూహంలో నరేంద్రుడు 
ఎదగడానికి దారి రాజకీయం 
ఒదగడానికి నీతి జాతీయం 

సభ్య పొరుగు దేశాలను కలుపుకు వెళ్లే సంస్కారి 
మభ్య పెట్టె వారి భారతం పెట్టగల ధీశాలి 
స్వచ్ఛ భారత్ ను సగర్వముగా స్వాగతించాడు 
సదా  దేశ ప్రజల ఉన్నతిని స్వప్నిస్తాడు 

ప్రజల యోగా క్షేమాలు పదిలమంటాడు 
పది కాలాల పాటు సంతోషాలకు,
ఆరోగ్యాలకు యోగ అందాలమిస్తుందంటాడు 
విశ్వ వ్యాప్తి లో విలువైన పాత్ర పోషించాడు 

ప్రపంచ దేశాలన్నీ కలియ తిరుగుతున్నాడు 
ప్రజలకు టెర్రరిజం చేటని చాటుచున్నాడు 
నల్ల బజారు, లంచగొండి తనం నష్టమంటున్నాడు 
ఆటంక వాదం , ఉగ్రవాదం అసలొద్దు అంటున్నాడు 

పెద్ద  నోట్ల రద్దు ప్రతిపాదించి 
పెను సవాలుకు సై అన్నాడు 
ప్రజలకు మంచి చెడులు వివరించాడు 
నల్ల కుబేరుల నడ్డి విరిచాడు 

మడమ తిప్పని పోరు సాగించాడు 
మలి విడత ఎన్నికల సంగ్రామములో 
భాజపా ఓట్ల నిష్పత్తి పెంచుకున్నాడు 
మరచి పోలేని సీట్ల ప్రభంజనం సృష్టించాడు . 

No comments:

Post a Comment