ఆలోచనలెన్నయినా ఉండొచ్చు
ఆచరించే పట్టుదల ఉండాలి
అందుకు తగిన ప్రణాళిక ఎంచుకోవాలి
అందుకునే వరకు విశ్రమించనే కూడదు
గమ్యం ఏదైనా కావొచ్చు
గతులు ఎన్నయినా మార్చుకోవచ్చు
గమనం ఎలాగయినా నిర్ణయించుకోవచ్చు
గమ్యం చేరే వరకు పరిశమిస్తూనే ఉండాలి
ఆశయం ఏదైనా కావొచ్చు
అంకిత భావం కలిగి ఉండాలి
అడ్డంకులెన్నయినా ఎదురవ్వొచ్చు
అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలి
అయిన వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు
అంత మాత్రానికే నిరుత్సాహపడొద్దు
అర్దాంతరపు ఆలోచనలతో మానేయొద్దు
ఆత్మ స్థైర్యంతో అడుగులేయాల్సిందే
అందుకు సాక్షం అస్సాములో జాన్ మోనీ పయోంగ్
హలం పట్టి పొలం దున్నుతూనే పట్టా పుచ్చుకున్నది
ఖమ్మం,తల్లాడ, నారాయణపురం జరీనా
రోజుకూలీనుండి రోజా సమయములో
నిర్మల్ లో అధ్యాపకురాలిగ ఉద్యోగ బాధ్యత.
No comments:
Post a Comment