మేలుకో వినియోగదారుడా
మేలుకో వినియోగదారుడా మేలుకో
మేలు కోరుకుని నీ యోగక్షేమం చూసుకో
హక్కు భుక్తాల వివరాలు సాంతం తెలుసుకో
బాధ్యతనెరిగి నీ పరిధిలో మసలుకో
అత్యవసరాలు, అవసరాలు,విలాసాలు
అన్ని రకాల వస్తుసేవల కొనుగోళ్లలో
బ్రాండెడ్, అన్ బ్రాండెడ్ అంతరాలు,
రేట్లు, సైజుల విషయాలలో
తప్పుడు ప్రకటనల మోసాలను,
వరుస తూకం, మన్నిక విషయాలలో
వారంటీ, గారంటే అంతరాలెఱిఁగి
వాయిదాకొనుగోలు,నగదు కొనుగోలు
అద్దె కొనుగోలు విధానాల విషయాలను
కాల ప్రమాణాల, కాలుష్య కారకాల వివరణలు
వినియోగ విధి, విధానాల వివరాలను
విఛ్చిన్న నిర్వాహణ, ముందస్తు నిర్వాహణ
వినియోగదారు చట్ట నిబంధనలు
ఉదాహరించే విధముగా మసులుకో
ఊహలన్నీ యదార్థం గావించుకో
ప్రతీ వివరము ఓపికగా తెలుసుకో
పట్టుదలతో ఫలితాలను సాధించుకో
No comments:
Post a Comment