Sunday, June 10, 2018

ఆధిపత్యం పోరు


ఆధిపత్యం పోరు ప్రతీ చోట
అదేకదా మన భారతీయత్వం 
అర్థం కానివ్వదు ఆచరించేవారికి 
అంతు చిక్కదు అనుభవించేవారికి 

ఎందఱో మహానుభావులు 
ఎదురు నిలిచి పోరారు 
అరమరికలు లేని కరంచంద్ 
అందించాడు అహింసతో 

అందిపుచ్చుకున్నాడు ఆసనం 
ఆడంబరాల జవహరుడు 
అది మొదలు పారంపర్యం 
అంచెలంచెలుగ పెరుగుతూనే ఉంది 

మధ్యలో మనుషులు మారినా 
మారలేదు ఏ కోశానా 
మారినా తారు మారు 
మన బ్రతుకులు మరో మారు 

ప్రపంచాన ఏ దేశాన 
ప్రస్ఫుటం కాని  ఆధిపత్యం 
పట్టుకుని వేలాడుతుంది 
పదిలంగా మన జాతీయత్వం 
కేంద్రం రాష్ట్రాలపైన 
రాష్ట్రాలు ప్రాంతాలపైనా 
మొన్న తమిళం లో  తెలుగు 
నిన్న తెలుగులో  తెలంగాణం 

ఓటు వేసి గెలిపించిన పౌరుడే 
నీటుగా నిలదీయలేడు కౌన్సిలరునైనా 
ఆధిపత్య పీచమనగదీయగలిగే రోజులు 
ఎప్పుడొస్తాయో ఎదురుచూడవల్సిందే  

ఆరోగ్యకరమైన ఆధిపత్యం 
అభివృద్ధికి మూలధనం 
అదేకదా రామరాజ్య సూత్రం 
అందుకే యుగాలు మారినా ఉత్తమం 

No comments:

Post a Comment