భాష అంటే భావ మార్పిడి సాధనం
భాష ఉంటెనే బ్రతుకు నిలుస్తుంది
భాష వింటేనే భావం అందంగా ఉంటుంది
భాషలెన్ని ఉన్నా మాతృ భాష గొప్పది
అక్షరాస్యతకు సంపూర్ణత్వం
అందమైన చేతివ్రాతతోనే సాధ్యం
అష్ట వంకర్లతో అక్షరాలను వ్రాస్తే
అయిష్టంగా ఉంటుంది చదువడానికే
అక్షరాలే కదాని చాలామంది
అలక్ష్యం చేస్తూంటారు, కానీ
అందమైన పొందికగా అక్షరాలూ వ్రాస్తే
అందుకోవచ్చు ప్రశంసలు అందరి నుండి
కంప్యూటర్ల పుణ్యమా అని
కాగితాలపై రాసే అవకాశం
కనుమరుగౌచున్నది ఈ తరానికి
కష్టంగా ఉంది రాయడానికే ఇది వాస్తవం
ముత్యమంటి అక్షరములతో ముఖ్యంగా
మనకు గ్రహణ శక్తి పెరుగుతుంది
మంచి జ్ఞాపక శక్తి పెంపొందుతుంది
ముద్దు గొలిపించవచ్చు ఎదుటివారిని సైతం
సవ్య దిశగా, అపసవ్య దిశగా
సున్నాలు,అర సున్నాలను సాధన చేస్తే చాలు
సాధించొచ్చు చక్కనైన తెలుగు చేతివ్రాతని
సమాహార నిపుణుల సలక్షణ సలహా మిత్రమా
సాధనముతోనే సమకూరును ధరలోన
సంతృప్తి నిచ్చే చేతివ్రాతను ఇలలోన
No comments:
Post a Comment