Tuesday, March 19, 2024

తాంబూలం తేది : 25-03-2023 శీర్షిక : ఆప్యాయతల చిరునామా ...

 తాంబూలం

తేది : 25-03-2023
శీర్షిక : ఆప్యాయతల చిరునామా ... 

శ్రావ్యమైన సంగీత విభావరికి 
సర్దుకునే సరంజామాల లాగ 
తీరొక్క వస్తువు తీరైన పనులతో 
తీర్చిదిద్దు ఆరోగ్యాల పంట .... 

మడిస్తే వేలేడే  గాని విడిస్తేనే 
చాలా పనులు అవుతుంటాయి ... 
కార్యాలయాలలో కార్య శూరత 
రాజకీయాలలో రసరమ్యత .... 

శుభాలకు సుందరమై ముందు నిలుచు 
పెళ్లి  పేరంటాలలోన పెద్ద ముత్తైదువై .... 
ఆలుమగల అన్యోన్యతల అనురాగ 
సంకేతమే కాదు ... ఆధ్యాత్మికతల 
పూజలలో కూడా అగ్రభాగమే సుమా .... 

ప్రకృతమ్మను బోలు పచ్చనాకు 
పరిపక్వతల అధర పంటలకు అరుణమై 
సున్నం వక్క కాసు సుందరముగా 
చిలుక ముక్కులాగా చిక్కని రంగుకు .. 

అతిథుల ఆహ్వానాలలోన  
ఆప్యాయతల చిరునామాగా 
ఆదరణ మన్ననలు పొందు 
ఉచితమైన సంప్రదాయమై ..... 
భోజన తాంబూలాదులు స్వీకరించమంటూ ....  

No comments:

Post a Comment