Tuesday, March 19, 2024

చిత్ర గజల్ తేది : 25-03-2023

 చిత్ర గజల్ 

తేది : 25-03-2023

కనులలోన  నీరూపం 
కాంచినాను  చిన్నికన్న 
మూసిననూ తెరచిననూ 
నింపినాను  చిన్నికన్న 

అదరములా వేణువుతో 
ఓలలాడె గానములే 
శిరముపైన పింఛముతో 
తలచినాను చిన్నికన్న 

దరహాసము ముఖముపైన 
దర్శనమూ  భక్తులకూ
తాత్వికమే రూపమంత 
చూసినాను చిన్నికన్న 

జాగేలా  కరుణించక 
జగమేలే  పరంధామ 
మారాముల మనసుదోచి 
వేచినాను చిన్నికన్న 

రాజసాల కరిగింతును 
రసజగతిన మాధవుడా 
వలచినిలిచి ఎదురుచూపు 
ఓపలేను  చిన్నికన్న 

No comments:

Post a Comment