ఎందుకో ఈ వేళ
తేది 28-03-2023.
శీర్షిక : మనన మధురిమలు
బాల్యంలోనే బలంగా నాటుకుని
బహుదూరపు బాటసారిలా ..జతగా
నడుచిన ఆలోచనల మడిలో
మొలకెత్తిన అంకురములా ....
ఆలోచనలన్నీ అపురూపాలై
అడుగడుగున నిత్యం నీ రూపంలోనే
నిమగ్నమై ముచ్చటించుకుంటుంటే
శ్వాసల పరిమళాలు చుట్టుముట్టేవి. ...
పనుల ఒత్తిడిలో పరాకు
చిరాకులలో అడుగులు
తడబడుతుంటే నీ మాటల
సుగంధాలే కితకితలై జత కలిసేవి ...
తొలి చూపుల మాయలో ...
ఆ చిరునవ్వుల రువ్వులో ...
ఊపిరాడని శ్రమలను కూడా
ఉల్లసింప చేసి తేలిక చేస్తూ ...
పలకరించే నీ మోము కుసుమమే ...
ఎందుకో ఈ వేళ జ్ఞాపకాల
తోరణాలన్నీ వరసకట్టీ
మనన మధురిమలై
మానసమున విడిచి చేస్తున్నాయి ... .
No comments:
Post a Comment