Tuesday, March 19, 2024

చిత్రకవిత తేది: 24-03-2023 శీర్షిక : మత్స్యకన్యవా ...?

 చిత్రకవిత 

తేది: 24-03-2023
శీర్షిక : మత్స్యకన్యవా ...?

ఏమా ఠీవి ? ఏమా దర్పం ?
శంతనునే మోహింపజేసిన 
మాటలాడిన మత్స్యకన్యవా .... ?
మహాభారతానికే  మూల సూత్రనివా ?

కనుముక్కు తీరుతో 
కట్టిపడేసే మూర్తిమత్వం 
విద్యుల్లతలను మరిపించే 
తీగలాంటి నడుముతో..... 

అందం  చూస్తే అచ్చంగా 
బాపూ బొమ్మలా ఉంది .... 
అభినయం చూస్తేనేమో 
నండూరివారిని తలపిస్తుంది .... 

అదరని బెదరని ఆత్మ నిబ్బరం 
అడుగులో అడుగు వేస్తుంటే 
సొగసులన్నీ జాలువారే 
సోకులన్నీ నాజూకులై ..... 

వలను చేతబట్టిన వన్నెల చిన్నది 
వడి నడకల జోరు మీదున్నది 
వరసైన మామకోసమని 
వలపు కూరలు వండుదామనేమో .... 

No comments:

Post a Comment