Tuesday, March 19, 2024

పితృవాక్య పరిపాలకుడు తేది : 23-03-2023 శీర్షిక : యుగాలు మారినా జగాన తేజం

 పితృవాక్య పరిపాలకుడు 

తేది : 23-03-2023
శీర్షిక : యుగాలు మారినా జగాన తేజం 


రాజ్యమంటే భోజ్యం కాదని 
తండ్రిమాటకు తలొగ్గిన తీరు... 
కాదెందుకో కనువిప్పు సోదరులకు 
కలహాలు సమసిపోయే కథనం .... 

సుద్దిబుద్దులు చూడ చక్కదనం 
గురువు మాటలే శిరోధార్యం .... 
గురి కుదరదు ఏలనో ఈనాడు 
విజ్జల ఒజ్జలకు వినయ విధేయతలు .... 

యుగాలు మారినా జగాన తేజం 
రామ రాజ్యమే ఘన ఉదహరణం 
కాదెందుకో దృష్టాంతం కొందరికైనా 
కాసుల మీదే యావా నేటి తరం .... 

అష్టకష్టాలను అవలీలగా ఈదే ... 
అతివ శిరోమణి ఆ సీతమ్మ తల్లి ... 
అందిపుచ్చుకోరెందుకో అమ్మతల్లులు 
తగాదాల తండ్లాటలు సమసిపోవు .... 

సాక్షాత్తు నారాయణుని అంశే... అయినా 
నరుడై బోధించే విశదముగా మానవులకు 
నీతిబోధనల సారాంశం 
సవినయమై సన్నుతించమని ....  

తిప్పలని తెలిసినా గౌరవించే 
తిప్పని మాటను తిరుగులేకుండా ... 
అర్దాంగిని అడవికి పంపివేసి 
ప్రజలే పరమార్థం పాలకులకన్నాడు .... 

ఆణిముత్యాలైన ఆదర్శాలెన్నో 
అజరామరమే నేటికిని ..... 
బాధలెన్నయినా ... బోధనా సారాంశమే 
బంగారంలాంటి రామాయణం ... 

No comments:

Post a Comment