చిత్ర గజల్
తేది: 24-03-2023
6/6/6/6
సంతసాల సందడేది
సరసిజుడూ దూరమైతె
ఎదురుచూపు మిగులుతుంది
మనోహరుడు దూరమైతె
ఎన్నాళ్లీ నిరీక్షణలు
ఎద మీటిన రాగాలతొ
ముదమారగ రాడేమీ
ప్రియసఖుడూ దూరమైతె
లలనలలా మనములతో
ఆటలేల మదనులకూ
మాటమీద పయనమవడె
మనోజవుడు దూరమైతె
మనములనూ గ్రహించుతూ
మసలుకోరె మగవారూ
మసిలిపోయె మనసులకూ
వల్లభుడూ దూరమైతె
రాజసమే నావిభుడూ
నామనమూ గ్రహించగా
దురవస్థలు రానీయడు
మోహనుడూ దూరమైతె
No comments:
Post a Comment