ఉపవాసం
తేది : 24-03-2023
శీర్షిక : అంతిమంగా ఆరోగ్యం ....
ఉన్నతమైన ఆచారాలు
ఉదాత్తమైన సంప్రదాయం
ఉత్కృష్టమైన శాస్త్రీయం
ఊతమయ్యే
ఆరోగ్యరహస్యం ....
ఉపచారాలన్నీ తెలియకపోయినా
ఉత్తమోత్తమ ముక్తి మార్గం ....
ఉడతాభక్తి దీపారాధనలు ....
ఉపవాసములతో నామ స్మరణలు ...
మనసా వాచా కర్మణా పాటించే
నిష్కల్మష నిర్మలత్వాలకు
నిజ భక్తి యోగం ... అంతిమంగా
ఆరోగ్య సంరక్షణలే ఆచారం ....
మతమేదైనా మనిషికి మేలు చేయాలి
పద్దతేదైనా పరిధిలోనుండాలి ....
ఏకాగ్రతలకు మార్గదర్శనం ....
ఆధ్యాత్మికమైనా ఆరోగ్యదాయకం ....
No comments:
Post a Comment