Tuesday, March 19, 2024

నివురు గప్పిన నిప్పు తేది : 29-03-2023 శీర్షిక : పొంచిన ముప్పు

 నివురు గప్పిన నిప్పు 

తేది : 29-03-2023
శీర్షిక : పొంచిన ముప్పు 

బతుకు బండి గిరికీలు కొడుతున్నా 
మెతుకు కుండలు భల్లుమంటున్నా 
కడుపులు నింపలేని దైన్యాలు 
కాల్చి పారేసే సంస్కృతి గన్నులు .... 

యుద్ధ సామాగ్రిని నిద్ర లేపుతూ 
నిద్ర నటిస్తూ నీతులు వల్లించేది .... 
బాంబుల బట్వాడాలు చేస్తూనే 
బతిపూల బొకేలతో ప్రత్యక్షం .... 

ఆడవారిని అణగదొక్కాలని కొందరు .. 
అక్కర  తీర్చే యంత్రమంటూంటారు   ... 
నలుపు తెలుపుల నవనీతాలు కొన్ని ... 
జాతి మతముల  అహంకారాలు ఇంకొన్ని .... 

అణుబాంబుల బూచీలు చూపి 
పెను ప్రమాదాలు పెంచి పోషిస్తున్నారు ... 
మానవబాంబునంటూ భయపెడుతూ 
మానవత్వాల చిరునామాలను చెరిపేస్తున్నారు .... 

విశ్వమంతా భయం గుప్పిట బతుకులే… 
దేశాలన్నీ మేకపోతు గాంభీర్యాలే 
కొంతమంది వెంటబడి తరుముతుంటే ... 
మరికొంతమంది పెంచిపోషిస్తుంటే … 

ఇవి చాలవన్నట్టు ... వింతరోగాల 
తేనెతుట్టలో వికటంగా రాయి విసిరేసి….
విశ్వాన్నే వణికించిన వింత ధోరిణి… 
చచ్చి… చంపి…ఎవరి బాగు కోరుకుంటున్నట్టు .... 
ఏం బావుకుంటున్నట్టు…. ?

మెతకతనం లేని మేలిమి బంగారు గుణం 
శౌర్య పరాక్రమాల శంఖం పూరింపులతో
వినమ్ర వీరత్వాల విల్లం ఎక్కుపెట్టే
సకల సద్గుణ గణాల సార్వాభౌమత్వం…
మెడలు వంచి...  మంచి బోధించే తత్వం … 
ఎప్పటికైనా ఎనలేని సంపదలే…..

No comments:

Post a Comment