శ్రీరామ నవమి
తేది : 30-03-2023
శీర్షిక : దాశరథీ
దాశరథీ నమోనమో
దశగుణనిధి నమోనమో
కౌసల్యా పుత్రునిగా
కారణజన్మం మానవరూపం ...
ధర్మరక్షణకు పూనుకుని
మార్గదర్శమని భోధించితివి ....
పరంధాముని అంశతోడుగా
పునర్వసు నక్షత్రాన
పుణ్యతిథినా జన్మించి
పురుషోత్తముడై వెలుగొందితివి ...
దాశరథీ నమోనమో
దశగుణనిధి నమోనమో
కైకేయి మాటలపైనా
కానలకు అరుదెంచి...
అన్నదమ్ములనురాగం
అనిర్వచనమని తెలిపితివి ....
ప్రజాభిమానం పెల్లుబుకంగా
పటుతరమాయె నీమదిన ....
పాదుకలిచ్చి భరతునికి
పాలించమంటివి ప్రతినిధిగా ...
దాశరథీ నమోనమో
దశగుణనిధి నమోనమో
మాయజేసి రావణుండు
మహిజాతను గొనిపొంగను ....
వనమంతా కలియతిరిగి
వగచుచు నువు గాలించగా .....
శివాంశ సంభూతుడైన
వాయుసుతుడు ప్రణమిల్లగ...
క్షత్రియునిగా వాలిజంపి
మైత్రిపొంద సుగ్రీవునితో ...
దాశరథీ నమోనమో
దశగుణనిధి నమోనమో
జటాయువు జాడదెలుప
వారు వెదికే నలుదిశలా ...
వాయుసుతుని వార్తలు విని
వారధిని బంధించితివి .....
శంకలువీడి లంకజేరి
శత్రుమూకల చెండాడి ....
శరణన్న విభీషణుకు
శత్రురాజ్యం ధారబోస్తివి ....
దాశరథీ నమోనమో
దశగుణనిధి నమోనమో
మాత చెరను విడిపించ
జరిపించిరి పట్టాభిషేకం ....
పట్టరాని సంతోషమే
జయజయ ద్వానాల......
ప్రజలంతా సుఖశాంతుల
సుభిక్షాల వర్ధిల్లా
రామరాజ్య పాలనలే
ఫరిఢవిల్లే ధరణిలోన ....
దాశరథీ నమోనమో
దశగుణనిధి నమోనమో
నగునూరి రాజన్న
No comments:
Post a Comment