చిత్ర కవిత
తేది : 26-03-2023
శీర్షిక : అణకువకే ప్రేరణ ....
విశ్వవీథి గగనాన విశాల ప్రపంచంలో
విహారానికి వినువీధులలా ...
వింతగా నీకు తాడు తోడై నిలిచెనా
తమాయించుక నడవడానికి ....
అడుగులో అడుగు వేస్తూ
ఆడపిల్లనని తెలిపావమ్మా ....
అణకువకే ప్రేరణగా నిలిచి
అత్యంత జాగ్రత్తలు చూపావు ....
బరువులెన్ని మోస్తున్నా
అవని మాతనే నన్నావు ....
బాధ్యతల బందీలలో
బహులెస్సగ పాఠమయ్యావు ...
తీగపైన తీరైన సాహసాలతో
జీవనగతిని తెలిపావు ....
రెక్కాడితే గాని డొక్కాడదని
రిక్తహస్తాల రాకపోకలు చూపావు ....
పట్టు సడలకుండా
పట్టుకున్నావు వెదురు బొంగు
క్రమశిక్షణల కవాతులకై
కనువిందుల కమనీయతలకై ....
No comments:
Post a Comment