అజాగ్రత్త
తేది : 31-03-2023
శీర్షిక : మూల్యం ....
అచ్చు తేడా మాత్రమే అనుకోవద్దు
జాగ్రత్త ... అజాగ్రత్తల నడుమ
అఘాతమయ్యే అనంతాలు
ఇమిడి ఉన్నయి ...గుర్తించగలిగితే ...
శూన్యంలో మాన్యమై సూదిమొనలాంటి
అగ్రము పై నిలబడిన అవనిమాతలా
అడుగడున పాటిస్తేనే జాగ్రత్తకు చిరునామా ....
లేదంటే ఊహించనలవికాని స్థితులే ....
అనుక్షణం కంటిమీద కునుకులేక
అవకాశాలన్నీ అందిపుచ్చుకుని
ఆకాశాన్ని చుంబించాలనుకునే
ఆ శాస్త్రజ్ఞులను పలకరిస్తే తెలుస్తుంది ...
అజాగ్రత్తల మూల్యం .....
వైద్యో నారాయణః అన్నట్టు ....
మానవ శరీరాలకు కోతలు పెట్టి
మరమ్మతులు చేస్తున్న సమయంలో
మత్తు మందు వైద్యున్ని సంప్రదిస్తే
చాలు ...
అజాగ్రత్తల
ఖరీదు ...
కంటిమీద కునుకు మరిచి
కన్నవారికి కట్టుకున్నవారికి
కడు దూరంగా ... పొలిమేరల
కొండలపై కాపలా ఉండే సైనికులకు
సాంతం తెలుసు ... అజాగ్రత్త వాలకం ...
ప్రజాదనమే పారితోషికాలుగా
పంచుకుంటున్న కొంతమంది
నేటి తరం నాయకులను ఎన్నుకోవడంలో
రూడీలే .... అజాగ్రత్తల ప్రతిభలు ....
No comments:
Post a Comment