Tuesday, March 19, 2024

తెలుగు వత్సరాది తేది :22-03-2023 శీర్షిక : చిన్ని కోరిక ....

 తెలుగు వత్సరాది 

తేది :22-03-2023
శీర్షిక :  చిన్ని కోరిక .... 
సంఖ్య : సహస్రాధికం 

వస్తుంది వస్తుందనడంతోనే 
వారం ముందు నుండే హడావుడి.... 
కొత్త వస్తువులకోసం కోనలన్నీ 
వడఁబోస్తే గాని కోరిక తీరదు.... 

సంధికాలంలో జీవితాలాయే 
సందిగ్దతలతో సతమతం .... 
వదిలిపెట్టి బలాదూరనలేము 
పట్టుకుని సంతృప్తిపడలేము .... 

పల్లెతావునైతే పక్కపక్కన్నే 
పట్టుమని దొరికేవి ప్రతీది .... 
పట్నంలో కొత్తకుండల  వేటతో  
మొదలయ్యి ... కొనుక్కునే 
వేపపువ్వు వరకు అన్నీను .... 

శుభకృతులో పేరుక పోయిన 
శుభాలనన్నీ  మోసుకొనిరావమ్మా ... 
శోభకృతు వత్సరమా పదిలమై పనిగట్టుకుని 
మా ముఖాలపై వెలుగులు నింప... 

అభాసుపాలవుతున్న తెలుగు 
సంస్కృతిని చక్కదిద్ది .... ఆపదల  
నుండి గట్టెక్కించే అనువైన మార్గం 
అందించి చేయూతనీయమ్మా ... 

ఆడపిల్లల ఉసురులు తీసే 
రాక్షసమూకల భరతంపట్టి 
చిరునవ్వులు చిట్టి మల్లెలు 
పూయించమ్మ తల్లితండ్రుల 
మోములపై .... 

పంటల శ్వాసలతో బ్రతికే 
మా హాలికున్ని కంటకాలతో 
బాధించక... మింటినంటే 
సంతోషాలతో పలకరించవమ్మా .... 

గ్రామసింహాల బాధలు తప్పించి 
సిరిమల్లెలు కురిపించే చిన్నారుల 
మోములపై ... నేనున్నానని 
అభయహస్తంగా అరుదెంచమ్మా .... 

లగయించే సాధించే లక్షలకోట్లు 
కాదమ్మా ... చిన్ని చిన్ని కోరికలతో 
చింతలన్నీ తీర్చి .... చిరుకానుకల 
మధుర గానంతో మమ్మలరించమ్మా !

No comments:

Post a Comment