అంశం: ఇదేమి మాయా లోకం
తేది: 30-09-2020
శీర్షిక: అవును ! ఇదో పెద్ద మాయాలోకం
సంఖ్య: 529
అవును ! ఇదో పెద్ద మాయాలోకం
పునరుత్పత్తి పుణ్యమే అతి పెద్ద మాయ
భవ బంధాలను అల్లిపెడతాడు
బాధ్యతలను నిర్వర్తించమంటాడు
తామరాకుపై నీటి బొట్టులా అంటీ
ముట్ట నట్టుండమంటాడు......
పుట్టినవాడు గిట్టక తప్పదనే
ఆనవాయితీ అందరికి తెలిసినా
తీరు మారని ఈ లోకం తీరే అంత
తెల్లవారితే చాలు మడత పేచీలే ...
ప్రజానాయకులే పహిల్వాన్లు
భూబకాసురులై భుజియించుటకు
కొంతమంది అధికారులే ఆనవాళ్ళైరి
అన్యాయాలకు అడ్డగోలు పందేరాలకు....
స్వార్థం దురాశ జోడుగుర్రాలు
ఒక్కసారి నెత్తికెక్కిందా
మనిషి తత్వం గోవిందా
మానవత్వం మసకబారుతుంది...
మత్తు వదలని నాయకులే
చిత్తు చిత్తుగా మందులు పంచేసి
మాట వరసకు మత్తులేందంటూ
సుత్తి డ్రంకెన్ డ్రైవ్ ల దందాలు ...
కలిలో ఒక పాదమనుకుంటే
కనీసం కూడా నోచుకోని వైనం
కళ్ళముందే మాయ కదులుతున్నా
కుళ్ళును కడిగే ధైర్యం కానరాదు ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment