చిగురించిన వసంతం
తేది : 11-09-2020
శీర్షిక : అసలైన విశ్వ వసంతం....
సంఖ్య : 513
అవును!
శిశిరంలో ఆకురాల్చుకుని మార్పు కోరుతూ నువు
వస్తావని ఎదురు చూస్తాను పసిడి వసంతానికై
కొమ్మలు రెమ్మలు పాతవే అయినా
కొత్త చిగుర్లతో వసంతాన్ని ఆహ్వానిస్తాను....
అప్పుడప్పుడు ఋతువుల గతులు తప్పినా
మమతల తలపులతో మునిగి మమేకమై
ఆశగా ఆర్తిగా నీ రాకకై నిలువునా పులకిస్తూ....
కొంగొత్త ఆశలతో ఆశయాలతో ఎదురు
చూస్తూంటాను .....
అతివృష్టి అనావృష్టిల అల్లకల్లోలాలున్నా
తట్టుకుని ఎండా వానలకు నిలదొక్కుకుని
మనసునిండా మధురమైన ఆలోచనలు
నింపుకుని మనువున్నంతవరకు నీ రాకకై
వేచియుంటాను ....
ఆనందాలతో అలారారాల్సిన మావి చిగుళ్ళు
ఆమని వసంతాలు... కోయిల కూజితాలు...
అసలు ఉగాది నుండే కనిపించని క్రిమితో
కలియబడి పోరాడుతూ అలసి పోతున్నాయి...
ఇకనైనా ఆ కల్లోల జీవితాలలో
ఆనందాలు నిండిన అమృత క్షణాలు...
మహోన్నతత్వం జోడించే మానవ కల్యాణానికి
అసలైన విశ్వ వసంతం చిగురించే ఆనతీయుమా...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment