హాత్రాస్ లో అన్యాయం
తేది: 05-10-2020
సంఖ్య: 532
ఆ బిడ్డకు జరిగిన అన్యాయం ఒక పక్క
ఆ కుటుంబానికి తీరని వ్యధ మరోపక్క
ఇది చాలదన్నట్టు.....పాపం...
మనిషికో చెయ్యి వేసేస్తున్నారు
చితిని రాజెయ్య... మతులు పోగొట్ట..
అసలు నిలకడ లేని నాయక గణం
చివరి న్యాయం అక్కరలేని జనం
విధివంచితురాలే విశిష్టమయ్యింది
ప్రతిపక్షాలకు పదిలంగా...ఈనాడు
జనమంతా ఆత్రంగా జల్లుమన్నారు
గోకి గోకి పుండును గొల్లుమనిపించ..
సహకారాల మచ్చట్లు సంకనేసుకుని
అన్నీ కరటక దమనక వినయాలే...
వాళ్లకున్న పతారకు ఇంటినుండి కూడ
ఇకమతుగా న్యాయం జరిపించవచ్చు..
పాపం ఎడ్డి జనాలకేం తెలుసు రూటు
శ్మశానానికి కాదు.. ఓటు బ్యాంకుకేనని...
సాక్షాత్తు రాజధానిలోని నిర్భయకే
ఏండ్లకేండ్లాయె..ఎనమిదేండ్లు
ప్రతి తల్లి మనసులోని ఆశలు దీర
చట్టం ధర్మం న్యాయం...అంగాలన్నీ
సవ్యమైతే... తప్పదు...సరైన శిక్ష...
అనుమానాలకు తావుందనుకుంటే
శంకలకు శషభిషలకు చెల్లు చీటీ...
ఉన్నతమైన ఉదాహరణాలుగా
దివ్యమైన సందేశం.. దిశే శరణ్యం...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment