లలిత గేయము
శీర్షిక: పిల్ల తెమ్మెర
తేది: 03-10-2020
సంఖ్య: 531
పిల్ల తెమ్మెర వీచింది
కొంటె మనసు ఊగింది //2//
మోముపైన ముంగురులు
ముద్దులొలికి నాట్యమాడె
ఇనుమడించిన అందమేదో
చిన్నదాని సొంతమాయె .... // పిల్ల //
వంపు దేలిన నల్లజుట్టుతో
నాజూకు జడ నాట్యమాడగ
దొంగిలించిన దొరచూపుతో
గుండె సవ్వడి పెరిగిపోయే // పిల్ల //
పైట చెంగు చాటుమాటున
పసిడి సొగసుల ఊసులేవో
వయసు వలపు తెలిపింది
మనసు సంద్రమై విరిసింది // పిల్ల //
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment