15-8-2023
అంశం :స్వతంత్ర భారత దేశమా
శీర్షిక : చిగురించేది ....
స్వతంత్ర భారతమా వందనం
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ....
మాతృమూర్తిగా నీకు ఎల్లప్పుడూ
మనస్పూర్తి వందనములు...
మహోన్నతమైన మహిమాన్వితా
నీకు ఇదే అభివందనము ...
దేశమంటే మట్టికాదనీ
దేశమంటే మనుషులనీ
మహానుభావుల ఉవాచలూ ...
నిజము చేసి చూపించుమా ...
స్వతంత్ర భారతమా వందనం
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ...
నాగరికత నడకలలో
పునాదులే మానవత్వం ...
పుణ్యమైన పురోగతికి
పురిటి సంధి కొట్టకుంటే ....
మర్కటముల మార్పుతోనే
మనుష్యులవతరించారని ....
మతి చలించి మనుష్యులే
మర్కటపు ఛాయలౌతున్నారని ....
స్వతంత్ర భారతమా వందనం
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ...
సంశయమే సగటుమనిషికి
వెసులుబాటులేని తనానికి ....
అందుకే మరోసారి నినాదిద్దామా
మనువుతో మనుషులుంటేనే దేశమని ....
రంగులకూపం రాజకీయమయినా
హంగులలోకం రౌడీజమైనా ….
ముసుగురూపం కులమతాలైనా
కునారిల్లేది మానవత్వమే .....
స్వతంత్ర భారతమా వందనం
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ...
సాటి మనిషిని సన్మానించు
సవ్యదిశగా నడక సాగించు ....
సంకుచితాలను పారద్రోలుతూ
సోదర భావం కనబరుచు....
కులమతాలకతీతముగా
విజ్ఞులంతా ఒకటైతేనే ....
వికటిస్తున్న మానవత్వం
అంటుకట్టి చిగురించేది ….
స్వతంత్ర భారతమా వందనం
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment