చిత్ర కవిత
తేది : 11-08-2024
శీర్షిక : వైవిధ్యమైన వంటకం
వైవిధ్యమైన వంటకము
నోరూరించే రుచులతో
మానసోల్లాసములతో
పోహళింపుల పుష్పాలు ....
నూనెలో గోలింపులు లేకుండా
ఆవిరితో ఉడకేసుకునే
ఆరోగ్యాలకు చిటుకా
చిరుధాన్యాల మొలక ....
పల్లి కొబ్బరి పుట్నాల
చట్నీతో దట్టిస్తే
అల్పాహార విందులే
దక్షిణభారత శిరోమణులే ...
సాంబారుతో కూడా ఇడ్లీలను
స్నానమాచరింపజేసి
పిల్లలకు పెద్దలకు
బంధువులకు అర్పించవచ్చు ...
చిట్టి ఇడ్లీల పేరిట
చిందులే పిల్లలకు ....
కుడుములు పేరిట
కొదువలేదు వినాయకునికి ...
బియ్యపు రవ్వ
మినుపగుండ్ల పిండితో
వారెవ్వా అనే రుచులు
వైవిధ్యమైన వంటలు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment