నాగ పంచమి
తేది : 08-08-2024
శీర్షిక : పరఃబ్రహ్మ స్వరూపం
సహస్రాధికం
చలిచీమల నుండి
చతుర్ముఖ బ్రహ్మ వరకు
రాయి రప్ప చెట్టు చేమ
గుట్ట వాగు వంక అన్నీ
పరఃబ్రహ్మ స్వరూపాలే ....
వేదపురాణాలు వేనోళ్ళ
కీర్తించగా పంచభూతాలు
సహా ప్రతీది దైవాంశములే
ఘనమైన మన హైందవమున ....
ఆ పరంధాముడికి పానుపవ్వగా
పరమశివునికేమో ఆభరణమాయె ...
విశిష్టముగా వినాయకునికి
యజ్ఞోపవీతమై సుబ్రహ్మణ్యునికి
ప్రతిరూపమై కొలువైన దైవం ....
సంతాన దేవతగా సర్వజనుల
పూజనీయమై కొంగుబంగారంగా
కొలువబడుచుండెను శ్రావణ
శుక్ల పంచమికి సలక్షణముగా ....
వ్రతములుగా నోములుగా
ఆచరించెదరు ... వరసబెట్టి
సంతానముకై పూజించెదరు ...
వెన్నుపాము బోలు నాగుపాముకు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment