ఎర్ర తివాచీ
తేది : 13-08-2024
శీర్షిక : రారాజు గులాబీలా
సహస్రాధికం
పూవుల్లో రారాజైన పూబోణిలా
ఎర్ర గులాబీలను బోలు
ఎర్ర తివాచీ గౌరవమంటే
ఎందరికి దొరికేను ఈ అనుబంధం ....
గుణములలో మేటి ఘనమైతే
బలముగానే గర్జనలై వినిపించును ....
జయజయ ధ్వానములు
జయహో జయహో రాగములు ...
మంచిని మించినదింకేమున్నది
మనకు మనమై గౌరవించుకోవడం ...
మమతలను మరోతీరు ప్రస్తావించుకోవడం
ప్రేమను బహు గొప్పగా నిర్వచించుకోవడం ....
ఆత్మీయతల మల్లెలు విరబూయడం
అనురాగాల మందారాలు విచ్చుకోవడం
మరువ దమనాలై పరిమళించడం
మరిచిపోలేని గుర్తుగా మిగిలిపోవడం ....
గ్రీకులో మొదటగా ప్రస్తావించబడినా
ప్రాకినది విశ్వమంతా పెన్నిధిగా ....
నాటకరంగంలో అది రక్తికట్టించినా
రచయితే పూనుకుని శంఖమూదాడు...
ఏది ఏమైనను ఘనమునకు
సవినయమైన సంప్రదాయ మయ్యింది
సంబరాలను సదా పంచినది
సగౌరవస్థానమును పొందినది
సభామర్యాదలు పాటించినది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment