చిత్ర కవిత
తేది : 12-08-2024
శీర్షిక : తెరిచిన పుస్తకమే
తెరిచిన పుస్తకమైనా
తెలిసిన సంద్రమైనా
లోతులను కొలతేయలేని
విజ్ఞాన భాండాగారములే ....
విజ్ఞాన దాహమైనా
వింతైన సముద్ర లోతైనా
అంతులేనిది... ఒకరికి
మరొకరికి పొంతన కుదరనిది ...
ఎంతమంది చదివితే
అన్ని కోణాలలో అర్థం
స్ఫురిస్తుంది.... అలాగే
సముద్రము అంతే ....
ఇసుకపైన మొదలైన
అక్షరాలు పుస్తకంలో
పొదువుకుని సముద్రానికే
కానుకగా అందించినది ....
జీవితమంతా ఔపోశనపట్టినా
లెక్కతేలని పుస్తకాలే ....
కోకొల్లల పురాణాలు వేదాలు
ప్రబంధాలు లెక్కలేనన్ని
శాస్త్రాలు లెక్కకు మించిన
పుస్తకాలు.....
సంద్రం మదించితేనే
అమృతమైనా స్వాతిముత్యమైనా
పొత్తం మదించితేనే
విజ్ఞానమైనా వింతగా సారమైనా
అందిపుచ్చుకోగలిగేది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment