రంగుల వలయం
తేది : 08-08-2024
శీర్షిక : మానవాళి జీవితం
సహస్రాధికం
అతిథులలా వస్తుంటాయి
అప్పుడప్పుడు సూర్యచంద్రుల చుట్టూ
ఆకాశంలో
రంగులవలయం
అందమైన కాంతి మండలమై ...
నింగిలో హరివిల్లు వస్తే
నేలపై వరి జల్లు కురిసినట్టేనంటూ ...
హాలికులకు మనోల్లాసాలు
మానవాళి గొప్ప నమ్మకాలు....
వర్షఋతువులో హర్షముపొందగ
జీవరాశికంతకు పండగలా
మానవాళి మోదమొందగా
జీవితమంటే ఇదేనని బోధిస్తూ ...
చీకటివెలుగుల తోరణంలా
రేపటి బ్రతుకుల హరివిల్లై
ఆనందాలను అందిస్తూ
హారతిలా వెలుగులీనుతుంది ....
రంగులన్నీ పొదువుకున్న
రమ్యమైన ఇంద్రధనస్సు
పాఠాలను బోధన చేస్తూనే
ఆకాశంలో రారాజౌతుంది . ..
శాస్త్రరీత్యా నీటిలో చెందే
అంతఃపరావర్తనం మూలమైతే ....
ఆధ్యాత్మికముగా సాక్షాత్తు
ఇంద్రుని ధనస్సంటూ
ఇతివృత్తాలనేకం ...
వరుణుడు కరుణిస్తే కలిగేది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment