ప్రొ జయశంకర్
తేది : 06-08-2024
శీర్షిక : తెలంగాణ పితామహుడు
ఆణువణువూ పులకరింపే
తెలంగాణా పలకరింపు ....
మాతృభూమిపైన మమకారం
మడమతిప్పని పోరాట తత్వం ...
ఆజన్మ బ్రహ్మచారి
అకుంఠిత దీక్షాపరుడు
వేదికలెన్ని ఎక్కినా
ఊదెను తెలంగాణ మంత్రం ...
నీళ్లు నిధులు నియమాకాలన్నాడు
వలసవాద కపట నీతులు ఎండగట్టాడు
గుండెల్లో గుచ్చుకున్న గాయానికి
ఉండేలు దెబ్బలు గురిపెట్టాడు ...
తమిళవాదమునాడే
తకురారుతో తండ్లాడినాడు
సాంబారు గో బ్యాకంటూ
పోరి తాను నిలిచాడు ....
ఉన్నత చదువులందిపుచ్చుకున్నా
ఉపకులపతిగా ఎదిగే క్రమంలో
ఉక్కుపాదాల తొక్కిసలాటలో
ఊపిరాడని క్షణాలెన్నో లెక్కించాడు ...
యాచకత్వం మాకొద్దన్నాడు
శాశనకర్తగా ఎదగాలన్నాడు ...
సమయానుకూలంగా
స్పందిస్తూ వచ్చాడు ...
బహుభాషా కోవిదుడు
నాన్ ముల్కీ ఉద్యమకారుడు
తగ్గినాడు హెచ్చినాడు
తగిన సమయం కొరకు వేచాడు ...
సకలజనుల సమ్మెకు
సారథిగా నిలిచాడు....
అందివచ్చే సమయానికి
అందకుండా పైకేగాడు ...
జోహారు జయశంకర్ సారూ
మీకు వేవేల జోహార్లు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment