చిత్ర కవిత
07-01-24
శీర్షిక : హేమంతపు సీమంతం
హేమంతంలో సీమంతంలా
చలిపులికి
తాళలేక మంచు దుప్పటి కప్పుకున్న
అవని మాత..అల్లంత దూరం దృష్టి
ఆనక రవాణా కష్టాలు రహదార్లపైన..
గల్లీ అయినా ఢిల్లీ అయినా చలి ఛాతీ
విరుచుకోగానే పిల్లి తోకముడిచినట్టు
జనమంతా వినయంతో వినమ్రులై
విధేయతల చిరునామాగా మారిపోతున్నారు...
మధాహ్నమైనా మబ్బుపట్టిన
ఉదయాతపూర్వంలా భానున్ని
బతిమాలి ప్రకాశాన్ని సంధ్యా ప్రదోషంలా
చూపి చకితులను చేస్తున్నది ...
ఆగని కాలంతో అతలాకుతలమే..
కాలచక్రంతో కవాతు చేసే కదనరంగపు
జవానులకు మంచుకొండల పలకరింపులు
కోట్ల మంది నిశ్చింతలను ఊపిరిగా శ్వాసిస్తూ …
స్వార్థం వీడని సన్నాసుల చేతల్లో.. చర్చల్లో…
విలవిలలాడే వింత
ప్రకృతి కలుషితాల
భూషితమై
కాలుష్యాల పంటలతో మానవాళికి
జీవరాశికి సవాలు విసురుతూంది...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment