గతి తప్పని గురి
తేది : 05-08-2024
శీర్షిక : మన జన్మకో సార్థకత ..
గురి కుదిరిందా తిరుగులేదు
సాధన సౌరభాల ఖజానా
చలించని ఏకాగ్రతల తోడు
మదించిన ప్రయత్నాల నీడ ....
ప్రత్యక్ష శారీరక శ్రమాలకైనా
పరోక్ష మానసిక శ్రమాలకైనా ....
మార్పు ఎంతో అవసరం
ఆటవిడుపు అత్యవసరం....
మేధోమదనాల చదరంగం
క్యారం లాంటివైనా ... శారీరక శ్రమల
మూలమయ్యే అనేక రకాల బంతి
ఆటలైనా కబడ్డీలైనా మనోల్లాసమే మహత్యం ....
చదువుల పరీక్షల్లో తప్పని విజయాలకైనా ...
ఆటల తోటలో ఎదురులేని గెలుపులకైనా ...
అనుభవాల పూదోటలో ఆటాడుకున్న
మన కలాం సారు బోధనలా ... ఇష్టమైన
రంగంలో హరివిల్లుబోలు కలలు కనడం
కసితీరా కష్టించి సాకారం చేసుకోవడమే
సముచితం
సమున్నతం
....
విభిన్నమైన ఆలోచనలతో
వైవిధ్యమైన ఆచరణలతో
వింతగొలిపే ప్రయత్నాలతో
కఠోర శ్రమల కమ్మని ఫలితాలకు
కిరీటి కంట పడిన పక్షి కన్నులా
ఎన్నెన్నో అకుంఠిత దీక్షా దక్షతలు ....
గతి తప్పని గురి కలిగిందా
విశ్వవిజేతలే... మనూబాకర్లా
ఒలంపిక్స్లో ఓలలాడిన
తిరుగులేని విజయ సంకేతములే ...
వినయ విధేయతల శోభలే ...
గుమ్మపాల లాంటి కమ్మని
గురుతుల కలల సాకారంలో ....
నిలువెత్తు దేశ పతాక గౌరవ వందనం
కోటాను కోట్లప్రజల ఆనంద హేల
మన జన్మకో సార్ధకత ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment